ETV Bharat / city

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మూసివేత

కరోనా ప్రభావం నానాటికీ ఎక్కువవుతోన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ) చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 23 నుంచి వసతిగృహాలు, మెస్​ల మూసివేతకు నిర్ణయించింది.

hcu-hostels-colsed-for-the-cose-fo-covid-19-spreed
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
author img

By

Published : Mar 21, 2020, 6:31 AM IST

కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వసతి గృహాలను ఏప్రిల్ 6 వరకు మూసివేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈనెల 23 నుంచి వసతి గృహాలు, మెస్​లు మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23న ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. హాస్టళ్లకు విద్యుత్, మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపింది. తరగతులు, పరీక్షల నిర్వహణపై ఏప్రిల్ 6 తర్వాత సమీక్షిస్తామని వెల్లడించింది.

రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. డిగ్రీ, బీఈడీ, ఎంబీఏ, బీఎల్ ఐఎస్​సీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఫార్మా కౌన్సిల్​లో ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్లు, ఇతర ఆన్​లైన్ సేవలను రద్దు చేసినట్లు కౌన్సిల్ వెల్లడించింది.

ఇవీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.