high court on movie tickets : సినిమా టికెట్ల అంశంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్లో టికెట్ విక్రయాలపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలనుకోవటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్ల యాజమాన్యాలకు టికెట్లు విక్రయించుకునే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించటం గుత్తాధిపత్యం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై సోమవారంలోపు తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణయం తీసుకోకపోతే జీవోపై స్టే విధిస్తామని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవీ చదవండి: