ETV Bharat / city

జల దిగ్భందమైన హయత్​నగర్ సబ్​ స్టేషన్

భారీ వర్షానికి హయత్​నగర్ విద్యుత్ ఉపకేంద్రం నీట మునిగింది. సబ్​స్టేషన్ పరిధిలోని కాలనీల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాన్స్​కో సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

hayat nagar power substation floating in rain water
జల దిగ్భందమైన హయత్​నగర్ సబ్​ స్టేషన్
author img

By

Published : Oct 13, 2020, 11:24 PM IST

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, ఇళ్లు జలమయమైంది. హాయత్​నగర్​ సబ్​ స్టేషన్​ నీటిలో జలదిగ్భందమైంది. ఎగువన ఉన్న సాహెబ్ నగర్ చెరువు కట్టతెగడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. వరదకు తోడు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానతో సబ్​ స్టేషన్ మునిగిపోయింది.

జల దిగ్భందమైన హయత్​నగర్ సబ్​ స్టేషన్

దీంతో సబ్​ స్టేషన్ పరిధిలోని కాలనీల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జోరు వానకు తోడు కరెంట్ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వెంటనే విద్యుత్ పునరుద్ధరించేందుకు ట్రాన్స్​కో సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే వరద తీవ్రత తగ్గకపోవడం, వర్షం ఆగనందున ఉదయం వరకు కరెంట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.