హస్తినాపురం కార్పొరేటర్‌గా గెలిచిన భాజపా అభ్యర్థి బాణోతు సుజాతకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్న వ్యాజ్యాన్ని మూడు నెలల్లో తేల్చాలని సిటీ సివిల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదన్న నిబంధనను ఉల్లంఘించినందున సుజాత ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల ట్రిబ్యునల్ హోదా ఉన్న సిటీ సివిల్ కోర్టులో తెరాస అభ్యర్థిగా పద్మనాయక్ పిటిషన్ దాఖలు చేశారు.
సిటీ సివిల్ కోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందున... అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. అయితే సుజాతపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని... ఆరోపణలు నిజమని తేలితే ఎన్నికల్లో పోటీకి అనర్హత పడే అవకాశం ఉన్నందున పిటిషన్‌ను త్వరగా తేల్చాలని సిటీ సివిల్ కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ముగించింది.
ఇదీ చూడండి: అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరణ