పోలీసుల సోదాల సమయంలో... భాజపా కార్యకర్తలు, నేతలు వ్యవహరించిన తీరును తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. తమ తప్పులేదని రుజువు చేసుకోకుండా గొడవ చేయడం సరికాదని హితవు పిలికారు.
"పోలీసులు సోదాలు చేస్తే మీరు వీడియోలు తీయోచ్చు గదా. దొరికిన దొంగను దొంగ అనకుండా ఏమంటారు. ఇవాళ డబ్బులు మీకు ఏం అవసరం? డబ్బులతో రాజకీయాలెందుకు? కారు తనిఖీ చేస్తే.. ఈ లొల్లి ఏంది. మీ దుకాణమే ఖాళీ అయిపోయింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేంది."
-హరీశ్‌రావు, తెలంగాణ ఆర్థికమంత్రి
ఇదీ చూడండి: షేర్‌చాట్‌లో స్కిట్ కోసం బాలుణ్ని బలిచేసిన బిహార్ వాసి