ETV Bharat / city

నా సహోద్యోగి చూపులతో చంపేస్తున్నాడు - work place harassment

'నాదో విచిత్ర సమస్య. ఆఫీసులో కొత్తగా చేరిన జూనియర్‌ నన్నలా చూస్తూనే ఉంటాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఏదో మూల నుంచి అతను నన్నే చూస్తుండటం గమనించా. పొరబాటున తనవైపు నేను చూసినా నేను కళ్లు తిప్పుకోవాల్సిందే కానీ.. తను మాత్రం ఆపడం లేదు. సహోద్యోగి నన్ను చూస్తున్నాడని ఫిర్యాదు చేయలేను. అది తప్పు కిందకీ రాదు. కానీ ఇబ్బందిగా ఉంది. ఏం చేయను?' - ఓ సోదరి

work place harassment
work place harassment
author img

By

Published : Apr 20, 2022, 10:01 AM IST

నిజమే.. మీరు చెప్పినట్టు చూడటం తప్పుకాదు. అదే మీరు నెట్‌ఫ్లిక్స్‌ లాంటి పెద్ద టెక్‌ సంస్థలో చేస్తుండుంటే మాత్రం ఇది తప్పే. అక్కడ వేధింపుల నివారణ చర్యల ప్రకారం మహిళల్ని ఎవరైనా అయిదు సెకన్లకన్నా ఎక్కువ సమయం చూస్తే ఇబ్బంది పెట్టినట్టే లెక్క. ఆ అబ్బాయి తీరు అసహజంగా తోస్తే.. అతని మేనేజర్‌ని అనధికారికంగా కలవండి. అతనలా చూస్తోంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్ని చర్చించడమే సమంజసం. దీని తర్వాతా అతని తీరులో మార్పు రాకపోతే.. తనతోనే మాట్లాడండి. కొందరు ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీంతో వాళ్లకే తెలియకుండా అలా చూస్తూ ఉంటారు. మీరు కదిలిస్తే తనకీ అవగాహన వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు నచ్చదన్న విషయం తెలుస్తుంది. దీంతో తీరు మార్చుకుంటారు. ఈ ప్రయత్నాల తర్వాతా పరిస్థితిలో మార్పు రాకపోతే, హెచ్‌ఆర్‌ విభాగం సాయం కోరండి. వాళ్లే మీకు సాయం చేస్తారు.

- కవితా గూడపాటి, ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.