ETV Bharat / city

పదో తరగతిలో సగం ఛాయిస్‌.. విద్యార్థులు యమా ఖుష్

పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తీపికబురు చెప్పింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడటం, ఆన్​లైన్ తరగతులకు కొంత మంది విద్యార్థులు హాజరుకాకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఛాయిస్​ 50 శాతానికి పెంచారు.

Half a choice in the tenth class exams in Telangana
పదో తరగతిలో సగం ఛాయిస్
author img

By

Published : Feb 14, 2021, 7:32 AM IST

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఛాయిస్‌ 50 శాతానికి పెంచారు. అంటే ఇచ్చిన ప్రశ్నల్లో సగం వదిలేసి మిగిలిన సగానికి మాత్రమే జవాబులు రాయాలి. హిందీలో ఆ ఛాయిస్‌ మరింత పెరిగింది. అందులో మూడు ప్రశ్నలిస్తే ఒకటి రాసేలా వెసులుబాటు కల్పించారు. పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు కేటాయించే మార్కులను కూడా ఈసారి రెట్టింపు చేశారు. పార్ట్‌-బిగా పిలిచే బహుళ ఐచ్ఛిక (మల్టిపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నల్లో మాత్రం ఛాయిస్‌ లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) శనివారం రాత్రి మాదిరి ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వాటిని www.scert.telangana.gov.in వెబ్‌సైట్లో ఉంచింది.

ముఖ్య మార్పులు..

* కేవలం 70 శాతం సిలబస్‌ మాత్రమే పరీక్షలకు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది.

* ప్రతి ప్రశ్నపత్రం పార్ట్‌-ఎ, పార్ట్‌-బిగా ఉంటుంది. సైన్స్‌లో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు పార్ట్‌-ఎకి 60 మార్కులు, పార్ట్‌-బికి 20 మార్కులు కేటాయించారు. పార్ట్‌-ఎలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో సగం ఛాయిస్‌ ఉంటుంది. అంటే నాలుగు ఇస్తే రెండు రాయాలి. ఆరు ఇస్తే మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక మార్కు ప్రశ్నలను రెండు మార్కులుగా, రెండు మార్కులవి నాలుగుగా, నాలుగువి ఎనిమిది మార్కుల ప్రశ్నలుగా మార్చారు.

* పార్ట్‌-బిలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు అరమార్కు ఉండేది. ఇప్పుడు ఒక మార్కు కేటాయించారు.

* ఆంగ్లంలో పాసేజీలను పాఠ్య పుస్తకం నుంచే ఇస్తారు. గ్రామర్‌కు ప్రాధాన్యం పెంచారని హైదరాబాద్‌కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు.

* సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులు ఉన్నందున వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇస్తారు. సమాధానాలు వేర్వేరు పత్రాలపై రాయాలి. ఒక్కో దానికి 40 మార్కులు. అందులో 30 మార్కులు పార్ట్‌-ఎ, 10 మార్కులు పార్ట్‌-బిలో ఉంటాయి.

ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో ఇదీ విధానం..

* ప్రశ్నపత్రం 80 మార్కులు. 3.15 గంటల్లో సమాధానాలు రాయాలి.

* పార్ట్‌-ఎలో 1, 2, 3 సెక్షన్లు ఉంటాయి.

* సెక్షన్‌-1లో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఆరు ప్రశ్నలిస్తారు. అందులో మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.

* సెక్షన్‌-2లో మొత్తం ఎనిమిది ప్రశ్నలిస్తారు. ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాయాలి. ప్రతి దానికి 4 మార్కులు.

* సెక్షన్‌-3లో గ్రూప్‌-ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఇచ్చిన 4 ప్రశ్నల నుంచి ఏవైనా రెండింటికి జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.