ETV Bharat / city

రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు

దేశంలోనే మొదటి సారి రాష్ట్రంలో గురుకుల న్యాయ కళాశాలలు రాబోతున్నాయి. ఎస్సీ బాలికల, ఎస్టీ అబ్బాయిల బాలుర గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటుకు సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. కనీసం ఒక కళాశాల ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎల్ఎల్ఎంలో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు
రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు
author img

By

Published : Nov 7, 2020, 8:43 AM IST

రాష్ట్రంలో త్వరలోనే ఎస్సీ, ఎస్టీ గురుకుల న్యాయ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇంటర్ బాలికల కోసం న్యాయ కళాశాల ఏర్పాటుకు ఎస్సీ గురుకుల సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఘట్​కేసర్​లో బాలికలకు ఐదేళ్ల బీఏ- ఎల్ఎల్​బీ కాలేజీ ఏర్పాటు కోసం ఎస్సీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

నలభై సీట్లతో కళాశాల కోసం ఎస్సీ గురుకుల సొసైటీ చేసిన దరఖాస్తుకు బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ప్రక్రియ పూర్తయినట్లు లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరమే కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సంగారెడ్డిలో బాలుర ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్​బీ గురుకుల కాలేజీ కోసం ఎస్టీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. నలభై సీట్లతో ఈ కాలేజీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకులు, కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎల్ఎల్ఎంలో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ సిస్టంతో పాటు మానవ హక్కుల చట్టాలు అనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశ పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.