ETV Bharat / city

స్పందించకపోతే గోనె సంచుల కోరత తప్పదు

రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. యంత్రాంగం ఇప్పుడు స్పందించకపోతే గోనె సంచుల సమస్య వచ్చేట్టుంది. ప్రస్తుత యాసంగిలో సుమారు 1.31 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తాయని.. పది కోట్ల వరకు సంచులు అవసరమని అధికారులు అంచనా వేశారు. మూడు నుంచి నాలుగు కోట్లు పౌరసరఫరాల సంస్థ వద్ద ఉన్నాయి. మరో ఆరు కోట్లు కొనేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి సీజనులో 54 శాతం కొత్తవి, 46 శాతం పాతవి వినియోగించాలన్నది భారత ఆహార సంస్థ(ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఎఫ్‌సీఐ) నిబంధన.

స్పందించకపోతే గోనె సంచుల కోరత తప్పదు
gunny bags shortage in telangana
author img

By

Published : Apr 11, 2021, 4:48 AM IST

సుమారు ఆరు కోట్ల పాత సంచులు కొనేందుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. దూరాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్కటి రూ.26-రూ.28లకు సరఫరా చేసేందుకు గుత్తేదారులు అంగీకరించారు. కరోనా కారణంగా ఒక్కో సంచికి రూ.32-రూ.35 వరకు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు రంగ ప్రవేశం చేయటంతో గుత్తేదారులు సరఫరా విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ధర పెంచాలంటూ వారు అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లు సమాచారం. అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.

కల్లాల్లోనే అమ్ముకుంటున్న రైతులు

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పదిహేను రోజుల కిందట నుంచే ధాన్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం మిల్లర్లు కొంటున్నారు. కొందరు కృత్రిమ ఇబ్బందులను సృష్టించి రైతుల నుంచి కల్లాల్లోనే తక్కువ ధరకు కొంటున్నారు. తొలిరోజుల్లో సన్న రకం ధాన్యానికి మంచి ధరే ఇచ్చినప్పటికీ తర్వాత నుంచి ధర తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ముందుగానే ధాన్యం రావటంతో వ్యాపారులు కొంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో గోనె సంచులు అందుబాటులో లేకపోవటంతో రైతులు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. కేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించి వారం కావస్తున్నా గోనె సంచులను జిల్లాలకు పంపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రరూపు దాలుస్తోన్న కొవిడ్‌ మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.