మే నెలలో సాధారణం కన్నా 46 శాతం అధికంగా వర్షపాతం నమోదవటం వల్ల రాష్ట్రంలో గతేడాది మే తో పోలిస్తే ఈసారి 2.09 మీ నీటిమట్టం పెరిగినట్లు రాష్ట్ర భూగర్భ జల శాఖ ప్రకటించింది. నెలవారీ భూగర్భజల మట్టాల సర్వేలో ఈ ఏడాది మే నెలలో సరాసరి నీటిమట్టం 9.19 మీటర్లుగా నమోదైనట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు(GroundWater) పెరిగాయని.. భూపాలపల్లి, నిజామాబాద్ వంటి మూడు జిల్లాల్లోనే స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. ఈ పెరుగుదల ఏప్రిల్ 2021తో పోలిస్తే 0.17 మీటర్లు తగ్గినట్లు వెల్లడించింది.
జగిత్యాల, పడమటి ఆసిఫాబాద్, పడమర, మధ్య -మంచిర్యాల, తూర్పు నిర్మల్, వరంగల్, తూర్పు కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, దక్షిణ, మధ్య నాగర్ కర్నూల్, గద్వాల్ ప్రాంతాల్లో 5 నుంచి పది మీటర్ల లోపు 53 శాతం, పది నుంచి పదిహేను మీటర్ల పరిధిలో 23 శాతం విస్తీర్ణంలో భూగర్భజలాలు విస్తరించి ఉన్నాయి. 15 నుంచి 20 మీటర్ల మట్టంలోపు 7 శాతం భూభూగం, 20 మీటర్ల లోపు 2 శాతం భూగంలో భూగర్భజలాలు విస్తరించి ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. తూర్పు నిజామాబాద్, దక్షిణ, తూర్పు సంగారెడ్డి, దక్షిణ మెదక్, దక్షిణ సిద్ధిపేట, తూర్పు భద్రాద్రి కొత్తగూడెం, మధ్య కామారెడ్డి, పడమర నిర్మల్, ఉత్తర వికారాబాద్ , ఉత్తర, పడమర, తూర్పు మహబూబ్ నగర్ జిల్లాల్లో అతిలోతులో భూగర్భజలాలు గుర్తించినట్లు భూగర్భ జల శాఖ ప్రకటించింది.
- ఇదీ చదవండి : 'కరోనా ఫ్రీ' గ్రామం.. రూ.50 లక్షల పురస్కారం