ETV Bharat / city

భారీ వర్షాలతో అమాంతం పెరిగిన భూగర్భజలాలు

author img

By

Published : Nov 17, 2020, 7:18 AM IST

Updated : Nov 17, 2020, 7:49 AM IST

రాష్ట్రంలో వర్షాలు, చెరువులు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన రిజర్వాయర్లు కారణంగా భూగర్జ జలాలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ తో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో భూగర్భ జలాలు 3.70 మీటర్ల పెరిగినట్టు గుర్తించారు. అక్టోబర్​కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం... గతేడాదిలో 7.92 మీటర్ల సరాసరి లోతులో భూగర్బజలాలు ఉండగా... ఈసారి 4.22 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. భూగర్భంలో ఉన్న నీటి సామర్థ్యం కూడా పెరిగింది.

ground water levels increased in telangana

రాష్ట్రంలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలమట్టం పైపైకి వచ్చింది. గత పదేళ్లలో అక్టోబరులో నీటి మట్టాలను పరిశీలిస్తే సగటున ఈ ఏడాది అదే నెలలో 4.42 మీటర్ల మేర పెరిగింది. ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు మధ్య రాష్ట్రంలో నాలుగైదు జిల్లాలు మినహా మిగిలినచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది మే నెలతో... అక్టోబరు నెలను పోల్చితే భూగర్భంలో 149 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న మట్టం పెరిగినట్లు... మేరకు భూగర్భ జలవనరుల శాఖ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరీవాహక ప్రాంతంలో గతేడాది అక్టోబరులో 42 శాతం భూభాగంలో మాత్రమే 5 నుంచి 10 మీటర్ల మధ్య భూగర్భ జలమట్టం ఉండేది. ఈ ఏడాది అక్టోబరు నాటికి 79శాతం భూభాగానికి విస్తరించింది.

రాష్ట్రంలో మే నెలతో పోల్చితే భూగర్భంలో 771 టీఎంసీలు నీళ్లు పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం అక్టోబర్​లోనే 149 టీఎంసీలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 69 శాతం ప్రాంతంలో భూగర్భజలాలు 5 మీటర్ల లోతు కుంటే తక్కువలో ఉన్నాయి. 5 నుంచి 10 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్న ప్రాంతం 23 శాతం కాగా... పది నుంచి 15 మీటర్ల లోతులో ఉన్న ప్రాంతం 5 శాతం. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీరు ఉన్న ప్రాంతం 1 శాతం కంటే తక్కువగానే ఉండగా... ఈ ప్రాంతాలు కేవలం 19 మండలాల్లోనే ఉన్నాయి. ఈ మండలాల్లో ఆరింటిలో అక్టోబర్ 2019తో పోల్చితే భూగర్భజలాలు మరితం తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది.

వర్షకాలం నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో వర్ష సాధారణం కంటే 53 శాతం ఎక్కువగా కురిసింది. 33 జిల్లాల్లో 27 జిలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... వర్షపాతం లోటు ఏ జిల్లాలో కూడా నమోదు కాలేదు. మొత్తం 589 మండలాల్లో 448 మండలాలు ఎక్కువ వర్షపాతం, 125 సాధారణ వర్షపాతం, 16 లోటు వర్షపాతం పొందాయి. మే 2020తో పోల్చి అక్టోబర్ 2020 భూగర్భజలాలను చూసుకున్నట్లయితే... నల్గొండ జిల్లా లెంకలపల్లి గ్రామంలో గరిష్ఠంగా 35.58 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగాయి. నల్గొండ జిల్లా కుదాబక్ష్​పల్లిలో అత్యధికంగా 3.35 మీటర్ల వరకు భూగర్భజలాలు పడిపోయాయి. మే 2020తో పోల్చితే రాష్ట్రంలో సరాసరిగా 7.06 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. అక్టోబర్ 2019తో పోల్చి చూసుకున్నట్లయితే గరిష్ఠంగా వికారాబాద్ జిల్ల కుల్కచెర్ల మండలం పుట్టపాడ్​గ్రాంలో గరిష్ఠంగా 53.09 మీటర్ల మేర భూగర్భజలాలు పైకి వచ్చాయి. భద్రాద్రి జిల్లాలో గరిష్ఠంగా 14.88 మీటర్ల మేర భూగర్భజలాలు తగ్గిపోయాయి.

సెప్టెంబర్​తో పోల్చితే 1 శాతం మేర 20 మీటర్ల కంటే లోతు భూగర్భజలాలున్న ప్రాంతం తగ్గిపోయింది. 2010-19 మధ్య సరాసరిని తీసుకున్నట్లయితే 543 మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయి. అంతేకాకుండా 46 మండలాల్లో పడిపోయాయి. ఈ లెక్కల ప్రకారం రెండు మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భజలాలు పెరిగిన మండలాలు 455 కాగా రెండు మీటర్ల కంటే ఎక్కువ తగ్గిన మండలాలు 17.

ఇదీ చూడండి: ప్రజలకు రోజంతా విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎండీ ప్రభాకర్ రావు

Last Updated : Nov 17, 2020, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.