కరోనా నేపథ్యంలో అన్నార్తులను ఆదుకునేందుకు దాతల సహాయం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి నియోజక పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస అధ్యక్షుడు గణేష్ తన పుట్టినరోజు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని సుమారు 400 మంది నిరుపేదలు, వలస కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా మొగులమ్మ కాలనీలో కూరగాయలు, బియ్యాన్ని అందజేశారు. డివిజన్లో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి తమ నాయకులు డివిజన్లో తోచిన సహాయం అందిస్తున్నారని... ఆకలితో ఇబ్బంది పడుతున్నట్లు ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే సరకులను అందజేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం