ETV Bharat / city

కార్మికులకు అండగా నిలిచిన నేతలు.. నిత్యావసరాలు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు, కార్మికులకు ఆర్థిక భరోసా, సామాజిక భద్రతా కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలతో బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. అధికారులతో పాటు పలువురు నేతలు స్వచ్ఛందంగా తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.

author img

By

Published : Mar 31, 2020, 7:41 PM IST

groceries distributed to migrated labours of Hyderabad
కార్మికులకు అండగా నిలిచిన నేతలు.. నిత్యవసరాలు పంపిణీ

నాంపల్లి నియోజకవర్గంలోని ఇంద్రానగర్ బస్తీల్లో ఎస్సీ కమిషన్ రాములు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్​తోపాటు, నాంపల్లి భాజపా ఇంఛార్జ్ దేవర కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ... లాక్​డౌన్​ను విజయవంతం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు కోరారు. ప్రజలందరి సహకారం ఉంటేనే కరోనా మహమ్మారిని జయించవచ్చునని పేర్కొన్నారు.

మారేడ్ పల్లి, లక్ష్మీనగర్​లలో..

కాంగ్రెస్ నేత విజయరామరాజు ఆధ్వర్యంలో మారేడ్​పల్లి, లక్ష్మీనగర్​లోని పేదలకు ఒక్కో ఇంటికి రెండు కిలోల బియ్యం, కిలో పప్పు, టమాటాలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు ఎంతో క్రమశిక్షణతో కర్ఫ్యూలో పాల్గొంటున్నారని తెలిపారు. చాలా మంది ప్రజలు తినడానికి తిండి లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత తొందరగా ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పేదలందరికి బియ్యం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చైతన్యపురి కార్పోరేటర్ ఆధ్వర్యంలో..

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, దినసరి కూలీలకు చైతన్యపురి కార్పోరేటర్ జిన్నారం విఠల్‌ రెడ్డి నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. డివిజన్‌ పరిధిలోని కూలీలకు బియ్యం, పప్పు, నూనెను 300మందికి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

సుమారు 85 వేల మంది..

రెండు తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలవాలని భావించింది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వారికి ఆర్థిక భరోసా, సామాజిక భద్రతా కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గ్రేటర్ పరిధిలో వలస కార్మికుల లెక్కలు తీశారు. ప్రాథమిక అంచనా ప్రకారం హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్​లు, ఇతర విభాగాల్లో పనిచేసే వారు సుమారు 85వేల మంది ఉంటారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

భారీగా తరలివచ్చిన కార్మికులు..

ఈరోజు నుంచి వీరందరికి 12 కిలోల బియ్యం, రూ.500ల నగదు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్థానిక కార్పోరేటర్, వీఆర్వో ఆధ్వర్యంలో బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే వలస కార్మికులు ఆయా ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివచ్చారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట దాటినప్పటికి.. ఇంకా బియ్యం, నగదు పంపిణీ చేయలేదు.

రసాయనాల పిచికారి..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అగ్నిమాపక శాఖ అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్​లోని బ్రాహ్మణవాడ, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్ ప్రాంతాలలో ఫైర్ ఇంజన్​ల సహాయంతో రసాయనాలను పిచికారి చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఇకపై షాంపూ ప్యాకెట్ల తరహాలో రూపాయికే శానిటైజర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.