బొగ్గు వినియోగం(coal mining in telangana)పై కేంద్రం విధిస్తున్న ‘గ్రీన్ ఎనర్జీ(green energy)’ రుసుంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాల(thermal power plants in telangana)పై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఏటా రూ.1,200 కోట్ల చొప్పున గత ఏడేళ్లలో రూ.8,400 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో(TSGENCO)) తాజా అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23)లో కరెంట్ ఛార్జీల పెంపు(electricity charges hike in Telangana) ప్రతిపాదనల తయారీపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఏడాదికి సంబంధించిన ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్‌ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఈ నెలాఖరు వరకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జెన్‌కో(TSGENCO) జరిపిన అధ్యయనంలో రాష్ట్రం ఏర్పడినప్పటితో పోలిస్తే విద్యుదుత్పత్తి వ్యయం బాగా పెరిగిందని తేలింది.
ఎందుకిలా..
- థర్మల్ విద్యుత్కేంద్రాల్లో(thermal power plants in telangana) బొగ్గును మండించడం ద్వారా విడుదలవుతున్న కాలుష్యాన్ని నివారించి.. సౌర, పవన, జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని 2022 నాటికల్లా 1.75 లక్షల మెగావాట్లకు పెంచాలని కేంద్రం ఆరేళ్ల క్రితం నిర్ణయించింది. థర్మల్ విద్యుత్కేంద్రాల్లో(thermal power plants in telangana) ఉత్పత్తిని, కొత్త వాటి నిర్మాణాన్ని తగ్గించేందుకు గతంలో టన్ను బొగ్గుపై రూ.50 ఉన్న ‘గ్రీన్ ఎనర్జీ’ రుసుంను క్రమంగా రూ.400కి పెంచింది. ఫలితంగా యూనిట్‌కు సగటున 24 పైసల చొప్పున భారం పడుతోంది. ఈ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచి థర్మల్కేంద్రాలు వసూలు చేస్తున్నాయి. ఈ సొమ్మును ఛార్జీల ద్వారానే రాబట్టాల్సి ఉంటుందన్నది డిస్కంల వాదన.
- రాష్ట్రంలో గతేడాది(2021-22)లో 56 వేల ‘మిలియన్ యూనిట్ల’(ఎంయూ) కరెంటు వినియోగించగా అందులో థర్మల్కేంద్రాల్లో ఉత్పత్తి చేసిందే 50 వేల ఎంయూలుంది. దీనికి రూ.1,200 కోట్ల చొప్పున గ్రీన్ ఎనర్జీ భారం పడినట్లు జెన్‌కో తెలిపింది. ఏడేళ్లలో డిస్కంలపై రూ.8,400 కోట్ల భారం పడిందని పేర్కొంది.
- బొగ్గు అమ్మకపు ధరలను గనులు ఏటా 6 నుంచి 10% పెంచుతున్నాయి. గతేడాదిన్నరలోనే టన్ను ధర రూ.300 పెరిగింది. గనుల నుంచి బొగ్గును థర్మల్కేంద్రాలకు తరలించే గూడ్స్ రైళ్ల కిరాయిని రైల్వేశాఖ నాలుగేళ్లలో 40% పెంచినట్లు జెన్‌కో(TSGENCO) తెలిపింది.
- రాష్ట్రంలో బొగ్గు వ్యయం, గ్రీన్ ఎనర్జీ రుసుంతో పాటు ఇతర ఖర్చులూ కలిపితే ఒక్కో యూనిట్ సగటు సరఫరా వ్యయం రూ.7.14కి చేరిందని, అంతమేర రాబట్టుకోవడానికి ఛార్జీలను పెంచాల్సి ఉంటుందని డిస్కంల అంచనా.