జనవరి 27న జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలకమండలి సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఇందులో 2021-2022 వార్షిక బడ్జెట్ను జీహెచ్ఎంసీ పాత పాలక మండలి ఆమోదించనుంది.
గత నెలలో కొత్త పాలక మండలి కోసం ఎన్నికలు నిర్వహించింది. ఇటీవల గెలుపొందిన సభ్యుల పేర్లతో ఎస్‌ఈసీ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి పాలక మండలి సమావేశం తర్వాత కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది.
- ఇదీ చూడండి : పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం