ETV Bharat / city

వచ్చేవారం నుంచే ధాన్యం కొనుగోళ్లు..! - తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలో ఖరీఫ్​ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ఇక్కడి మార్కెట్లకు రాకుండా నియంత్రించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
author img

By

Published : Oct 14, 2019, 8:16 AM IST

రాష్ట్రంలో వచ్చే వారం నుంచి ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్​లో 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఇది 15 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనం. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ఇక్కడి మార్కెట్లకు రాకుండా నియంత్రించేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

2,544 కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 2,544 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ‘‘కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. టార్పాలిన్లు, ధాన్యం శుద్ధి, తేమను నిర్ధారించే యంత్రాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ధాన్యం ధర

  1. ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ. 1,835
  2. సాధారణ ధాన్యానికి క్వింటాకు రూ. 1,815

అన్ని శాఖలూ భాగస్వామ్యం

ధాన్యం కొనుగోళ్లతో సంబంధమున్న అన్ని శాఖల సమన్వయం కోసం తొలిసారిగా పౌరసరఫరాల శాఖ ఓ కమిటీని నియమించింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌.. ఛైర్మన్‌గా, వ్యవసాయ శాఖ కమిషనర్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌, సహకార శాఖ కమిషనర్‌, ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌, పోలీసు, కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రాంతీయ మేనేజర్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, సెర్ప్‌ సీఈవోలు సభ్యులుగా ఉంటారు.

జిల్లాస్థాయిలో ఛైర్మన్​గా జేసీ

జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌... ఛైర్మన్‌గా, ఎస్పీ, కార్మిక శాఖ అధికారి, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌లు సభ్యులుగా ఉంటారు. కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు.

12 లక్షల టన్నులు మాత్రమే

పౌరసరఫరాల శాఖ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో కేంద్ర పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి, 1800 425 00333, 1967 టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతుల సెల్‌ఫోన్లకు పంపే ఏర్పాట్లు చేశారు. మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యాన్ని కేటాయిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఖరీఫ్‌లో 12 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మిగిలిన వాటిని ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిందిగా సూచించారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.