Sri Rama Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాముని జన్మనక్షత్రమైన పునర్వసు సందర్భంగా శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా భక్తితో వైభవంగా జరుపుకుంటారన్న తమిళిసై... తన ఆదర్శగుణగుణాలతో శ్రీరాముుడు అందరికీ ధర్మమూర్తిగా పేరుగాంచారని పేర్కొన్నారు. రామనవమి సందర్భంగా సీతతో రాముని కల్యాణ మహోత్సవాన్ని పవిత్రంగా జరుపుకుంటామని తమిళిసై వివరించారు. ధర్మావతారమైన శ్రీరాముని నుంచి సమగ్ర జీవన విధానం కోసం అందరం ప్రేరణ పొందుదామని ఆకాంక్షించారు.
రాములోరి ఆశీస్సులుండాలి..
భద్రాద్రిలో సీతారాములకల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి శ్రీరాముడని కొనియాడారు. సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదన్న కేసీఆర్.. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని అభిప్రాయపడ్డారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ: సంతోషాలతో జీవనం సాగించేలా శ్రీసీతారాములు దీవించాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి: