Governor on Chakali Ilamma: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ఆమె జయంతిని పురస్కరించుకుని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సందర్భంగా చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని.. పీడిత వర్గ ప్రజల కోసం ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆమె త్యాగం ఎంతో గొప్పదని అన్నారు.
ఇవీ చదవండి: