మహిళల ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ పట్ల.. వారి కుటుంబాలు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డీసీజ్ ఇన్ ఉమెన్ అనే అంశంపై ప్రత్యేక సంచికను ఆమె రాజ్‌భవన్‌లో సోమవారం ఆవిష్కరించారు.
సమాజంతో పాటు కుటుంబాల్లోనూ మహిళల ఆరోగ్య రక్షణ విషయంలో మార్పు రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వస్తే... తొలి ప్రాధాన్యం మహిళా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇవ్వాలన్నారు. కరోనా మహమ్మారి మహిళల్లో అనేక సామాజిక, మానసిక సమస్యలను సృష్టించిందన్న గవర్నర్.. వీటి నుంచి జాగ్రత్తగా బయటపడాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: 'ఆయుర్వేదం'తో 5 రోజుల్లో కరోనా మాయం!