ETV Bharat / city

CDS Rawat passed away: 'దేశ రక్షణలో జనరల్​ బిపిన్​ రావత్​ సేవలు అమూల్యం' - బిపిన్​ రావత్​ మృతిపై గవర్నర్​ తమిళిసై సంతాపం

CDS Rawath death: భారత త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్​ అకాల మరణం పట్ల గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.

CDS Rawat passed away
జనరల్​ బిపిన్​ రావత్​ మృతి
author img

By

Published : Dec 8, 2021, 8:29 PM IST

Updated : Dec 8, 2021, 9:29 PM IST

CDS Rawat passed away: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మృతి పట్ల.. తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​, సీఎం కేసీఆర్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి, ఆర్మీ అధికారుల మరణాలపై సంతాపం ప్రకటించారు.

బాధాకరం

దేశానికి 42 ఏళ్ల పాటు సేవలందించిన రావత్​ మరణం.. దేశానికి, భారత సైన్యానికి తీరని లోటని గవర్నర్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో రావత్​తో పాటు ఆయన​ సతీమణి, మరో 11 మంది సైన్యాధికారులను కోల్పోవడం బాధాకరమని ట్విట్టర్​ ద్వారా పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

  • చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ శ్రీ బిపిన్ రావత్, శ్రీమతి మధులిక రావత్ , 11 మంది ఇతర ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది, తీవ్రంగా బాధించింది.

    దేశ రక్షణకు వారు అందించిన సేవలు అమూల్యం. వారికి ఘన నివాళులు.#BipinRawat #OmShanti

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసీఆర్ దిగ్భ్రాంతి

CDS Rawat helicopter crash: హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దేశానికి తీరని లోటు..

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నిరంతరం దేశ సేవలో, దేశపౌరుల భద్రత కోసం ఉన్న వ్యక్తి మరణం దేశానికి తీరని లోటన్నారు.

దురదృష్టకరం

సీడీఎస్ జనరల్ రావత్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్‌ తెలిపారు. రావత్ సతీమణి, మరో 11 మంది ఆర్మీ సిబ్బంది మరణం దురదృష్టకరమన్నారు. రావత్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఆయన సేవలు ఎనలేనివి

CDS Rawat death: బిపిన్‌ రావత్‌ మృతిపట్ల బండి సంజయ్‌ సంతాపం ప్రకటించారు. మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. రావత్ మరణం దేశానికి తీరనిలోటని సంజయ్​ ట్వీట్​ చేశారు. ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • Deeply saddened by the demise of the first Chief of Defence Staff of India General #BipinRawat ji, his wife & other armed forces personnel in an unfortunate MI-17 helicopter crash in Tamilnadu. pic.twitter.com/UaGqQDb8cQ

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాటలకు అందని విషాదం..

బిపిన్‌ రావత్‌ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రావత్ అకాల మరణం మాటలకు అందని విషాదాన్ని నింపిందన్నారు.

ఇవీ చదవండి: చాపర్ క్రాష్​లో​ సీడీఎస్​ రావత్​ దుర్మరణం

Last Updated : Dec 8, 2021, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.