ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఏ చిన్న చోటు ఉన్నా కూరగాయలు, పూల మొక్కలు పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన 9వ జాతీయ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శనను గవర్నర్ సందర్శించారు. వివిధ రకాల మొక్కలు పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
పూలు, పండ్ల తోటలంటే తనకు చాలా ఇష్టమని.. ప్రదర్శన చాలా బాగుందని కితాబిచ్చారు. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించి ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ రూఫ్ గార్డెన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐదు రోజులుగా జరుగుతున్న నర్సరీ మేళ నేటితో ముగిసింది.