ETV Bharat / city

ఏపీలో రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి: గవర్నర్​

Governor Biswabhusan on Earth Hour: ఏపీలో మార్చి 26న ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ సూచించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్​ను పాటించాలని ఆయన కోరారు.

Governor Bishwabhushan Harichandan
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్
author img

By

Published : Mar 26, 2022, 2:05 PM IST

Updated : Mar 26, 2022, 2:34 PM IST

Earth Hour on March 26th: ఏపీలో శనివారం(మార్చి 26) రాత్రి ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ కోరారు. పర్యావరణ చైతన్యవ్యాప్తి ఉద్యమంలో భాగంగా.. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు వాడాలని గవగ్నర్​ సూచించారు. ఎర్త్‌ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

భూమి మీద వెలువడుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం ఏర్పడిన ప్రజాచైతన్య ఉద్యమమే ఈ ఎర్త్‌ అవర్‌. పర్యావరణ చైతన్య ఉద్యమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న(శనివారం) రాత్రి ఎర్త్‌అవర్ పాటిస్తారు. ఈసందర్భంగా.. చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేశారు. గంటపాటు చీకట్లలో ఉండిపోయారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత పదేండ్లుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: Water Problems: వేసవిపూట.. నీటి కోసం కరీంనగర్​వాసులు కటకట..

Last Updated : Mar 26, 2022, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.