గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులులర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాహత్మనికి నివాళి అర్పించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించారు.
మహాత్ముని పోరాట స్ఫూర్తిని, నడచిన మార్గాన్ని, సత్యాన్వేషణా ప్రయాణాన్ని నేతలు స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహంతో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపిన తీరును గుర్తుచేసుకున్నారు.