భూగర్భ గనిలో పని చేసే సిబ్బందికి దినదిన గండంగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. గనుల్లో పనిచేసే సిబ్బందికి ఐటీ మినహాయింపులు అనేది కేంద్రం చేతిలో ఉందని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
పదవీ విరమణ పొందే లోపు ఉద్యోగి వివరాలన్నీ సిద్ధం చేయాలని సూచించారు. పదవీ విరమణ పొందాక సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి పంపాలని చెప్పారు. ఈ విషయంలో ఓ విధానం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కారుణ్య నియామకం విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మంత్రి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి