టోకు, చిల్లర వర్తకులకు పౌరసరఫరాలశాఖ అధికారులు హెచ్చరించారు. లాక్‌డౌన్ రోజుల్లో నిత్యావసరాల ధరలు పెంచవద్దని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిణి బాలమాయాదేవి ఆదేశించారు. అదనుచూసి ధరలు పెంచితే వర్తకులపై కఠిన చర్యలు తప్పవన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లను ఎక్కువ రేటుకు విక్రయిస్తే వారిపై వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టెందుకు 040- 23447770 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కరోనా జీవితకాల సవాల్- మీడియా ప్రముఖులతో వీసీలో మోదీ