ETV Bharat / city

కొవిడ్ నుంచి కోలుకున్నా... అధికారులు 'మీకు పాజిటివ్‌' అంటున్నారు!

అనుమానితులకు కరోనా పరీక్షలు చేసే ముందుగానే ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపరిచి పరీక్షలు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే పరీక్షలు చేసి తర్వాత ఫలితాలు నమోదు చేస్తున్నాయి. దీనివల్ల వివరాలు ఆలస్యంగా వైద్యారోగ్య శాఖకు వెళుతున్నాయి. నయమైన వ్యక్తులు సైతం వైద్యారోగ్య శాఖ లెక్కల్లో పాజిటివ్‌గా ఉంటున్నారు.

contacting covid victims after cured in telangana
కొవిడ్ నయమయ్యాక.. పాజిటివ్‌ అని ఫోన్‌ చేస్తున్న అధికారులు!
author img

By

Published : Jul 21, 2020, 8:50 AM IST

  • నగర శివారు పెబల్‌ సిటీలో ఉండే వ్యక్తికి గత నెలలో జ్వరం రాగా రాయదుర్గం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో వారం పాటు చికిత్స పొంది ఇంటికొచ్చి మరో 15 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరవాత స్థానిక పీహెచ్‌సీ నుంచి ఆయనకు ఫోన్‌ చేసి మీకు కరోనా పాజిటివ్‌ వచ్చిందనడంతో కంగుతిన్న ఆయన నాకు వైరస్‌ వచ్చి తగ్గిపోయి 20 రోజులు దాటిందని చెప్పడంతో తమకు ఫలితాలు ఇప్పుడే అందాయని వైద్య సిబ్బంది చెప్పారు.
  • కోకాపేటలోని గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే ఓ వ్యక్తికి జ్వరం రావడంతో గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. 5 రోజులు అక్కడే చికిత్స తీసుకున్నారు. 15 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. 20 రోజుల తర్వాత పీహెచ్‌సీ సిబ్బంది ఫోన్‌ చేసి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. తనకు చికిత్స పూర్తయిందని, 20 రోజులు దాటిందని చెప్పడంతో ఫోన్‌ పెట్టేశారు.

హైదరాబాద్​ నగరంలో ఎంతో మందికి ఇప్పుడు ఎక్కువగా ఇదే తరహా ఫోన్లు స్థానిక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ సిబ్బంది నుంచి వెళుతున్నాయి. వైరస్‌ బారిన పడి తగ్గిపోయిన వారు ఈ ఫోన్లతో హడలెత్తిపోతున్నారు. మళ్లీ సోకిందా.. అన్న భయంతో వణికిపోతున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేసే ముందుగానే ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపరిచి పరీక్షలు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే పరీక్షలు చేసి తర్వాత ఫలితాలు నమోదు చేస్తున్నాయి. దీనివల్ల వివరాలు ఆలస్యంగా వైద్యారోగ్య శాఖకు వెళుతున్నాయి. నయమైన వ్యక్తులు సైతం వైద్యారోగ్య శాఖ లెక్కల్లో పాజిటివ్‌గా ఉంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన పలువురు నేరుగా ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ వివరాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెంటనే చేరడం లేదు.

కంటెయిన్‌మెంట్‌ చేయరు.. కిట్టు ఇవ్వరు

పాజిటివ్‌ వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండే వ్యక్తుల ఇంటిని కంటెయిన్‌మెంట్‌ చేయాలి. ప్రభుత్వం తరఫున కిట్‌ అందించాలి. కానీ బాధితులకు నయమయ్యాక వైద్యారోగ్యశాఖకు వివరాలు వెళుతుండడం వల్ల కిట్లు అందడం లేదు. బయట మార్కెట్లో మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇదీ చూడండి: కోవాక్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశ విజయవంతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.