ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ హామీ ఇచ్చారు. యువతి కుటుంబాన్ని మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పరామర్శించారు. ఏపీ సీఎం జగన్.. యువతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.18.25 లక్షల ఆర్థిక సాాయం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రూ.4,12,500 తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. హత్యకు కారకులైన నిందితులను చట్టపరంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు.
- ఇదీ చదవండి : స్నేహలత హత్య కేసులో బయటికొచ్చిన సీసీ దృశ్యాలు