డీఎస్సీ 2008 అభ్యర్ధులకు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 4,657 మంది అభ్యర్థులకు గానూ.. 2,193 మందిని ఎస్జీటీలుగా నియమిస్తూ ఏపీ విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా.. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీరందరికీ మినిమమ్ టైమ్ స్కేలు వర్తిస్తుందని.. ప్రభుత్వం పేర్కొంది. ఎస్జీటీలుగా నియమితులైన వారందరికి.. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది. ప్రభుత్వం సూచించిన విధంగా.. ఆరు నెలల్లోగా ప్రాథమిక విద్యకు సంబంధించిన బ్రిడ్జి కోర్సు చేయాలని స్పష్టం చేసింది.
ఇదీచూడండి: సీబీఎస్ఈ క్లాస్-12 గ్రేడింగ్పై సుప్రీం కీలక ఆదేశాలు