కాగ్ నివేదికలోని అంశాలు
- బడ్జెట్ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థికశాఖ హేతుబద్ధం చేయాలి
- బడ్జెట్ అంచనాలతో పోల్చితే రెవెన్యూ రాబడి రూ.24,259 కోట్లు తగ్గింది
- బడ్జెట్ అంచనాల కన్నా రెవెన్యూ ఖర్చులు రూ.23,147 కోట్లు తగ్గాయి
- గత మూడేళ్లుగా రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో సమర్థత పెరిగింది
- ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి వ్యయం, క్యాపిటల్ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉంది
- విద్యారంగంలో మాత్రం వెనుకబడింది
- గత కొన్నేళ్లుగా అప్పులపై అధికంగా ఆధారపడటంతో చెల్లింపు బాధ్యతలు పెరిగాయి
- రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మౌలికసదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది
- డిస్కంల పునరుత్తేజం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి
- సాగునీటి ప్రాజెక్టులపైన ఇప్పటివరకు రూ.70,758 కోట్లు ఖర్చయ్యాయి
ఇదీ చూడండి: ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపింది: సీఎం కేసీఆర్