గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ నిమ్స్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆసుపత్రిలోని ఎం-బ్లాక్‌ను పరిశీలించి... అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడనున్నారు. నగరంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా ఆసుపత్రిలో సౌకర్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి