ఆయుష్మాన్ భారత్ దివస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 50 కోట్ల మంది లబ్ధిదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్య పథకమని అభివర్ణించారు.
ఆయుష్మాన్ భారత్తో పేదలు మరింత లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు.