Eluru Road Athmakatha Book : ప్రముఖ కవి, పాత్రికేయుడు తాడి ప్రకాశ్ రచించిన "ఏలూరు రోడ్ ఆత్మకథ" పుస్తకం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. విజయవాడకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు గోరటి.
ఏపీలో విజయవాడ-ఏలూరు రోడ్డులోని తన గత అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని గోరటి వెంకన్న అన్నారు. ఎందరో ప్రఖ్యాత సాహితీవేత్తలు, కవులకు బెజవాడ పుట్టినిల్లు అని కొనియాడారు. ఏలూరు రోడ్డు ఆత్మకథ పుస్తకంలో వచన రచన చాలా బాగుందని, తాడి ప్రకాశ్ చాలా గొప్పగా రాశారని ప్రశంసించారు. పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఠాకూర్ గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు, రచయితలు పాల్గొన్నారు.
- ఇవీ చదవండి :
- Hyderabad Book Fair: యువ రచయితల పుస్తకాలకు మంచి ఆదరణ
- అనుభవ సారం.. అక్షర హారం
- 'అణచివేత దగ్గరే సాహిత్యం ఉజ్వలంగా ఉంటుంది'
- 'గుళ్లోకి వెళ్తే చాలనుకున్నా.. ఏకంగా గర్భగుళ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు..'
- Gorati venkanna: 'ఆ పుస్తకం చదివిన ప్రతిసారీ ఓ కొత్త ఉత్తేజం'