ETV Bharat / city

'పాలు తాగకుంటే కొత్తగా వచ్చే సమస్యలేంటో తెలుసా..?

author img

By

Published : Oct 15, 2019, 5:48 PM IST

మీరు రోజూ పాలు తాగట్లేదా...? అయితే మీలో ప్రోటీన్​ లోపం ఉండే ఉంటుంది. నిత్యం పాలు తీసుకోని సుమారు 54 శాతం మంది పెద్దల్లో తగినంత ప్రోటీన్లు లేవని 'సౌత్ ఇండియా ప్రోటీన్ గ్యాప్' పేరుతో క్రీమ్​లైన్ నిర్వహించిన సర్వేలో తేలింది.

పెద్దల్లో తగ్గుతున్న ప్రోటీన్ల శాతం: గోద్రెజ్ సర్వే

నిత్యం పాలు తాగని వారిలో సుమారు 54 శాతం మందిలో తగినంత ప్రోటీన్లు ఉండటం లేదని ప్రముఖ అగ్రి సంస్థ గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ప్రకటించింది. గోద్రెజ్ అనుబంధ సంస్థ అయిన క్రీమ్​లైన్ 'సౌత్ ఇండియా ప్రోటీన్ గ్యాప్' పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదికను నేడు హైదరాబాద్​లో విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్​ ధరణి కృష్ణన్, క్రీమ్ లైన్ డెయిరీ లిమిటెడ్ ఎండీ భాస్కర్ రెడ్డి, సీఈఓ రాజ్ కన్వర్ పాల్గొన్నారు. వీరి సర్వేలో సుమారు 80శాతం మందికి రోజువారీ ఆహారంలో ప్రోటీన్ల ఆవశ్యకమైన అవగాహన ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో పిల్లల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పెద్దల్లో ప్రోటీన్ లోపం తలెత్తుతోందని పేర్కొన్నారు. శరీరంలో తగిన మోతాదులో ప్రోటీన్లు అందని పక్షంలో ఎదుగుదల లోపం, రోగ నిరోధకశక్తి తగ్గుదల సహా వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.