GRMB Meeting : రాష్ట్రంలోని చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, చిన్నకాళేశ్వరం ఎత్తిపోతలు, చనాకా-కోరటా ప్రాజెక్టుల సవివర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) అంశాలతోపాటు పలు విషయాలపై చర్చించేందుకు శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలోని బోర్డు కార్యాలయంలో ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు.
GRMB Meeting Today : బోర్డు నిర్వహణ, గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు ఎజెండాలో ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన డీపీఆర్‌లు, కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సీడ్‌మనీ బడ్జెట్ కేటాయింపు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వినిపించనున్నాయి. 200 కోట్ల రూపాయల చొప్పున సీడ్ మనీ డిపాజిట్, అనుమతుల్లేని ప్రాజెక్టులకు అనుమతుల గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. ఆ గడువు జూలై 14వ తేదీతో పూర్తి కానుంది. దీంతో సంబంధించిన అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.
- ఇదీ చదవండి : రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత