ETV Bharat / city

ఆ గోదారమ్మ ఉగ్రరూపానికి నేటితో 34 ఏళ్లు - taja news of godavari floods

గోదావరిని వరద ముంచెత్తుతోంది...గోదారోళ్లకు ఈ వరదలు ఇప్పటివి కావు...సరిగ్గా 34ఏళ్ల క్రితం ఇదే రోజు భారీ వరద గోదావరి జిల్లాను అతలాకుతలం చేసింది...ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు వరదలంటే ముందు 1986 నాటి వరదలే గుర్తుకువస్తాయి...అప్పుడు జరిగిన బీభత్సం అలాంటిది మరీ!.. 15రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు లేవు...చెట్టుకు వేళాడుతూ ప్రాణాలు కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి.

GODAVARI FLOODS
చరిత్ర సృష్టించిన గోదావరి వరదకు నేటికి 34ఏళ్లు పూర్తి
author img

By

Published : Aug 16, 2020, 9:57 PM IST

వరదలు మొదలైతే కోనసీమ వాసులకు మొదట గుర్తొచ్చేది 1986 నాటి పరిస్థితి. ఆ భారీ వరదలకు నేటితో 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1986 ఆగస్టు 16న అర్ధరాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 24.5 ఐదు అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. 35,06,388 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ వరద ధాటికి గోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగులంక వద్ద వశిష్ట ఎడమ ఏటిగట్టు ఏకంగా ఏడు చోట్ల తెగిపోయింది. దీంతో నాగులంక గ్రామం ఛిద్రమైంది. ఈ భారీ వరద ధాటికి రాజోలు, సకినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండల్లాలో ప్రజలు 15రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు.

ఇవీచూడండి: ఉగ్ర గోదారి... భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిలో నది ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.