ETV Bharat / city

'నాణ్యత లేని ఆహారం ఇవ్వడమంటే రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే' - గాంధీ ఆస్పత్రి ఆహారంపై హైకోర్టు వ్యాఖ్యలు

గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఆహారం సరఫరా కాంట్రాక్టరును కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భోజనంలో నాణ్యత లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోగులు ఫిర్యాదులు చేశారని ధర్మాసనం ప్రస్తావించింది. అనారోగ్యంతో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుందని పేర్కొంది.

high court
high court
author img

By

Published : Sep 30, 2020, 10:16 PM IST

గాంధీ వంటి ఆస్పత్రిలో నాణ్యత లేని ఆహారం అందించడమంటే.. రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఆహారం సరఫరా కాంట్రాక్టరును కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ భగవంతరావు దాఖలు చేసిన పిల్‌తో పాటు.. తన కాంట్రాక్టు రద్దు చేయడంపై కాంట్రాక్టరు సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను కలిపి ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

కాంట్రాక్టు తొలగింపులో నిబంధనలు పాటించలేదని.. కనీసం నోటీసు ఇవ్వలేదని కాంట్రాక్టరు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. భోజనంలో నాణ్యత లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోగులు ఫిర్యాదులు చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ప్రస్తావించింది. అనారోగ్యంతో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఆహారంలో నాణ్యత పెంచారని.. వివరణకు అధికారులు కూడా సంతృప్తి చెందారని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ అక్టోబరు 5కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు కాంట్రాక్టు కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరగా నిరాకరించిన హైకోర్టు.. ఆస్పత్రి విచరక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ఇదీ చదవండి : రాష్ట్రంలో గోనె సంచుల టెండర్లు రద్దు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.