హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. శేర్లింగంపల్లిలో 2 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ వర్షాకాల బృందాలు మ్యాన్ హోల్స్, క్యాచ్ పిట్లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిలిచి ఉన్న నీటిని తొట్టెలతో తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో రహదారులపై పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. రోడ్ల పరిశుభ్రత కోసం 30 అదనపు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ దానకిషోర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: భాజపా నుంచి నేనే సీఎం: కోమటిరెడ్డి..!