ETV Bharat / city

లీజు గడువు దాటినా ఖాళీ చేయట్లేదు.. చివరకు కోర్టు ఆదేశాలతో.. - fruit shops in mj market

demolish fruit shops: ఎంజే మార్కెట్​ పరిధిలో లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని దుకాణాలపై గ్రేటర్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ వచ్చి దుకాణాలను కూల్చివేశారు. చెప్పాపెట్టకుండా ఎలా కూల్చివేస్తారమంటూ దుకాణాదారులు కాసేపు వాగ్వాదానికి దిగడంతో.. కూల్చివేత సమయంలో ఉద్రిక్తత నెలకొంది.

demolish
demolish
author img

By

Published : Aug 2, 2022, 5:35 PM IST

demolish fruit shops: హైదరాబాద్ ఎంజే మార్కెట్​లోని పండ్ల వ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. 20 ఏళ్ళ క్రితం 8 వందల గజాల స్థలాన్ని కొంతమంది వ్యాపారులకు అద్దెకు ఇవ్వగా... 2021లో గడువు పూర్తి అయింది. అయినా కూడా ఖాళీ చేయకపోవడంతో పోలీసుల సమక్షంలో కూల్చివేశారు. కిరాయి దారులు ఖాళీ చేయకుండా వేధిస్తుండటంతో కోర్టును ఆశ్రయించినట్లు స్థల యజమాని తెలిపారు. తమకు కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా రావడంతో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సహాయంతో అద్దెకు ఉంటున్న పండ్ల వ్యాపారుల రేకుల షేడ్లను కూల్చేశారు.

కూల్చివేత సమయంలో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగకుండా అఫ్జల్ గంజ్ పీఎస్​ పోలీసులను మోహరించారు. వ్యాపారస్తులు కూల్చివేతను కాసేపు అడ్డుకొని జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రద్దీగా ఉండే అబిడ్స్ మార్గంలో కాసేపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది.

లీజు గడువు దాటినా ఖాళీ చేయట్లేదు.. చివరకు కోర్టు ఆదేశాలతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.