కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా... మాస్కులు ధరించడం మరవద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో మేయర్... కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్పరిణామాలు లేవని... 45 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. 60 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో రోజుకు లక్ష 20 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 1005 ప్రభుత్వ , 231 ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారని వివరించారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ కేంద్రాల్లో ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని మేయర్ పేర్కొన్నారు.