కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇవాళ 709 బృందాలతో 51,178 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 1,73,544 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు కేవలం కరోనా సంబంధించి ఫోన్ చేసిన వారికి ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు. రంజాన్ సందర్భంగా సెలవుదినమైనప్పటికీ ఫీవర్ సర్వే కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా