ETV Bharat / city

జోరుగా ఓటుకు నోటు డిమాండ్.. బల్దియా ఎన్నికల్లో న్యూ ట్రెండ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటుకు నోట్ల డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే కొన్ని కాలనీలు, అపార్టుమెంట్ల వారు అభ్యర్థుల ముందు తమ అవసరాలు ఏకరువు పెడుతున్నారు. అభ్యర్థులను వివిధ పనులు చేయించాలని కోరుతున్నారు. లేదా తామే పనులు చేయించుకుంటామని, సొమ్ము చెల్లిస్తే సరిపోతుందనీ సూచిస్తున్నారు.

author img

By

Published : Nov 23, 2020, 6:41 AM IST

GHMC election 2020 candidates agreements with voters
బల్దియా ఎన్నికల్లో నయా పోకడ

మా అపార్టుమెంటులో 24 సీసీ కెమెరాలు, పక్కా రికార్డింగ్‌ వ్యవస్థతో అధునాతన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీన్ని మీరు వెంటనే ఏర్పాటు చేయిస్తే మా అపార్టుమెంటులోని ఓటర్లందరితో ఓట్లు వేయించడానికి సిద్థం. మీరు పనులు చేయిస్తామంటే ఈ వ్యవస్థను ఏర్పాటుచేసే కంపెనీల వారిని పిలిపించి మాట్లాడి మీ వద్దకు పంపిస్తాం.

-కొత్తపేటలో ప్రధాన పార్టీ అభ్యర్థికి ఓ అపార్టుమెంటు సంక్షేమ సంఘం ప్రతినిధుల ప్రతిపాదన ఇది

మా అపార్టుమెంటు నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటినా బిల్డర్‌ ఇంకా కొన్ని పనులు చేయకుండా సతాయిస్తున్నాడు. మేం చేయించుకుంటామంటే డబ్బు ఇవ్వడం లేదు. మీరు అతన్ని పిలిపించి రాబోయే 10 రోజుల్లో పనులన్నీ చేయించండి. లేదా మీరైనా ఖర్చు భరించి చేయిస్తే ఎన్నికల్లో ఓట్లు వేస్తాం.

-ఎల్‌బీనగర్‌ ప్రాంతంలోని మరో అపార్టుమెంటు సంఘం డిమాండ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటుకు నోట్ల డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే కొన్ని కాలనీలు, అపార్టుమెంట్ల వారు అభ్యర్థుల ముందు తమ అవసరాలు ఏకరువు పెడుతున్నారు. అభ్యర్థులను వివిధ పనులు చేయించాలని కోరుతున్నారు. లేదా తామే పనులు చేయించుకుంటామని, సొమ్ము చెల్లిస్తే సరిపోతుందనీ సూచిస్తున్నారు.

ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పలు కాలనీలు, అపార్టుమెంట్లలోకి వరద నీరు వచ్చింది. అందుకు కారణమైన డ్రైనేజీలను బాగు చేయించాలని కోరుతున్నారు. ఉదాహరణకు సరస్వతీనగర్‌ ప్రాంతంలో చిన్నవర్షం కురిసినా డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

* ఈసీఐఎల్‌ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో 70కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. దాదాపు 240 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి అనుబంధంగా ఉన్న మరో భవనంలో 25 నివాస గృహాలు ఉన్నాయి. అక్కడ 100 మందికి పైగా ఓటర్లున్నారు. వీరంతా తమకు ఓట్లు వేస్తే షామియానా సామగ్రి (టెంట్‌) బహుమతిగా ఇచ్చేందుకు ఓ పార్టీ అభ్యర్థి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

* ఆధునిక వ్యాయామశాల ఏర్పాటు చేయాలంటూ సికింద్రాబాద్‌లోని ఓ అపార్టుమెంటు సంఘం డిమాండ్‌ చేసింది.

* కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని ఓ కాలనీ వాసులకు స్విమ్మింగ్‌పూల్‌ నిర్మించి ఇస్తానని ఓ అభ్యర్థి భరోసా ఇచ్చారు. ముందస్తు తేదీతో చెక్‌ కూడా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

* కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ పాత అపార్టుమెంటులో కొత్త లిఫ్ట్‌ ఏర్పాటు చేయిస్తే ఓట్లన్నీ వేయిస్తామని నివాసుల సంఘం స్పష్టం చేయడంతో ఓ పార్టీ అభ్యర్థి అంగీకరించాడు.
రూ.5 లక్షల వరకూ సరే!

ఎక్కువ ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. కనీసం 30కిపైగా కుటుంబాలుండే అపార్టుమెంట్లకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేల దాకా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల పనుల విలువను బట్టి ఒక్కో ఓటు విలువ రూ.5 వేలకు చేరుతోంది. ‘‘కార్పొరేటర్లుగా గెలిచినవారు సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా నగరపాలక సంస్థలో నిధులు లేక పనులు కావడం లేదంటున్నారు. ఏళ్ల తరబడి అలగే కాలం గడుపుతున్నారు. అందుకే ముందే పనులు చేయించాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ అపార్టుమెంటు సంఘం ప్రతినిధి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.