హైదరాబాద్‌లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులను తొలగిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. బర్లకుంట నుంచి ఖాజాగూడ చెరువు వరకు ఉన్న స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌ను 3 కోట్ల వ్యయంతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వరద ముంపు సమస్య తొలగిపోవడంతో పాటు సైబర్‌హిల్స్ కాలనీ పూర్తిగా వరద ముంపు సమస్య నుంచి బయటపడుతుందని అన్నారు. రూ.4.10 కోట్లతో బర్లకుంట సరప్లస్ నాలాపై ఆర్సీసీ ట్విన్ బాక్స్ డ్రెయిన్‌ను నిర్మించినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: ఈ వందేళ్లలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఇవే..