విదేశీ టపాకాయల దిగుమతులు, అమ్మకాలు, సరఫర చట్ట వ్యతిరేకమని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్లో విదేశీ టపాకాయల అమ్మకాలను గుర్తించేందుకు బృందాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రజలు విదేశీ టపాకాయలపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసిందని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి నగరానికి దిగుమతి కాలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసు విచారణ 16కు వాయిదా