బేగంబజార్ ప్రాంతం గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదని బేగంబజార్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పురుషోత్తం ఆరోపించారు. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ సమస్యతో పాటు నాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, పురపాలక మంత్రి కేటీఆర్ బేగంబజార్‌ను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక్కరికీ కేటాయించలేదన్నారు. ఒక్కసారి ప్రజలు తనకు అవకాశమిచ్చి కాంగ్రెస్‌ను గెలిపిస్తే బేగంబజార్ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు.
టీఆర్ఎస్ బేగంబజార్‌ను పట్టించుకోలేదు: పురుషోత్తం - GHMC ELECTIONS NEWS
బేగంబజార్ అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పనిచేసిన దాఖలా లేదని బేగంబజార్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పురుషోత్తం ఆరోపించారు. తనను గెలిపిస్తే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పార్కింగ్ సమస్య పరిష్కరిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.