ETV Bharat / city

Geothermal Power Plant: నీటి ఆవిరితో విద్యుత్ తయారీకి ఏర్పాట్లు..

నిరంతరం ఆవిరి, వేడి నీటిని అందించే హాట్ స్ప్రింగ్స్..ఇక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి జియోథర్మల్ స్పాట్స్ వద్ద విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో తొలి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది

Geothermal Power Plant, power plant news
నీటి ఆవిరితో విద్యుత్ తయారీకి ఏర్పాట్లు, జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్
author img

By

Published : Nov 5, 2021, 12:34 PM IST

నీటి ఆవిరితో విద్యుత్ తయారీకి ఏర్పాట్లు

దేశంలో మొదటిసారిగా జియోథర్మల్ విద్యుత్ కేంద్రం జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటవుతోంది. లధ్దాఖ్ లో దీన్ని ఓఎన్‌జీసీ నిర్మిస్తోంది. చైనా సరిహద్దుల్లోని చుషుల్​కు సమీపంలో ఉన్న పుగా హాట్ స్ప్రింగ్ నుంచి వచ్చే నీటి ఆవిరి, వేడినీటితో విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. భూమిలోని రాతి, మట్టిపొరలకు దగ్గర్లో ఈ జియోథర్మల్ శక్తి అందుబాటులో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి మైళ్ల దిగువన ఉండే ఈ శక్తిని అందిపుచ్చుకునేలా ONGC ప్రాజెక్టును చేపట్టింది. పుగా హాట్ స్ప్రింగ్స్ వేల ఏళ్లుగా వేడి నీటిని, ఆవిరిని వెదజల్లుతోంది. ఈ శక్తినే వినియోగించుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలాంటి వేడి నీటి బుగ్గల సమీపంలో లోతైన బావులు తవ్వడం ద్వారా ఒక రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి వాటికి టర్బైన్లను అనుసంధానించి జియో థర్మల్ విద్యుత్​ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.

ఇప్పటికే అమెరికా, చైనా, ఐస్ ల్యాండ్ లాంటి 20 దేశాల్లో ఈ జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అమెరికా ఈ విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, న్యూజిలాండ్, చైనాలో జియోథర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వాస్తవానికి దేశంలో జియోథర్మల్ శక్తిని వినియోగించుకునేందుకు 2015 లోనే జాతీయ స్థాయి విధానానికి రూపకల్పన జరిగింది. ప్రాథమిక స్థాయిలో 2022 నాటికి వెయ్యి మెగావాట్ల విద్యుత్​ను ఈ జియోథర్మల్ శక్తి ద్వారా ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. పారిస్‌లో జరిగిన పర్యావరణ ఒప్పందం తర్వాత ఈ లక్ష్యాన్ని మరింతగా పెంచి 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దేశవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో జియోథర్మల్ శక్తిని ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు.

తెలుగురాష్ట్రాల్లోని గోదావరి బేసిన్‌లోని ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలో జియోథర్మల్ శక్తి ఉత్పత్తికి అవకాశముంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఐస్ ల్యాండ్​తోనూ భారత్ ఒప్పందం చేసుకుంది. పర్యావరణ హిత శక్తి ద్వారా నిరంతర విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతానికి తక్కువ స్థాయిలో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం లద్దాఖ్‌లో ఓఎన్‌జీసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. తదుపరి దశలవారీగా ఈ ప్లాంట్‌ను విస్తరించనుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.