ETV Bharat / city

కరోనాను ఎలా నివారించాలో గరికపాటి మాటల్లో... - కరోనాపై గరికపాటి సలహాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మందులేని ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ కొనుగోనేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఒక సూచన చేశారు. కరోనాలాంటి వ్యాధి గురించి ‘యోగా వశిష్టం’లో చెప్పారన్నారు. అందుకు సంబంధించిన వివరాలను తాజాగా పంచుకున్నారు.

garikapati-suggestions-on-corona-control
కరోనా గురించి గరికపాటి ఏమంటున్నారంటే..
author img

By

Published : Apr 29, 2020, 1:06 PM IST

‘‘కరోనాలాంటి వ్యాధుల గురించి ‘యోగవశిష్టం’లో ప్రమాణం ఉంది. అది 32వేల శ్లోకాల గ్రంథం. శ్రీరాముడికి వశిష్టుడు చేసిన బోధ. అందులో ఉత్పత్తి ప్రకరణంలో 69 సర్గలో విశూచిక అనే వ్యాధి వ్యాపిస్తుందని అప్పట్లో చెప్పారు. ‘దుర్భోజన’, ‘దురారంభ:’ ‘మూర్ఖ’ ‘దుశ్చిత్యేష్టే’ అని స్పష్టంగా చెప్పబడి ఉంది. రకరకాల జంతు మాంసాలను తినడాన్ని దుర్భోజనం అంటారు. దుష్ట సంకల్పాలు కలిగి యుద్ధాలొచ్చినప్పుడు ఎలాగైనా మనం గెలిచి తీరాలని కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లు జీవాయుధాలు ప్రయోగించాలనే దుష్ట సంకల్పాలు కలిగి ఉంటారు. వాళ్ల దగ్గర మొదలై, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉందని యోగ వశిష్టంలో కొన్ని వేల ఏళ్ల కిందట చెప్పారు’’

‘‘కొన్నిసార్లు వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఉన్నాయా లేదా? అన్నది గుర్తించడం కష్టం.. సగుణం.. విగుణం జైవజనమాసాదైషచి అని చెప్పిన యోగ వశిష్టంలో పరిష్కారం చెప్పారు. మందు, మంత్రం రెండూ ఉన్నాయి. ముందుగా ఏం చెప్పారంటే..? ‘ఆతురం చెంతయేత్‌ చంద్రేరసాయన హృదిస్థితం అంజనా మరణంయుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః’ దీనికి సంబంధించిన వ్యాధి నుంచి బయటపడాలంటే ‘చంద్రేరసాయన హృదిస్థితం’ అంటే చంద్ర సంబంధమైన వస్తువులు దీనికి మందుగా పనికొస్తాయట’’

‘‘నాకు తెలిసి, నవరత్నాల్లో ముత్యాలు చంద్రునికి సంబంధించింది. నవధాన్యాలలో ఒకటి చంద్రుడికి సంబంధించింది. ఈ చంద్ర సంబంధం పదార్థాలతో వాటి నుంచి తయారైన రసాయనాలతో దీనికి మందు దొరకవచ్చు. నేను తెలుగు భాషలో మాత్రమే పండితుడిని, వైద్యానికి సంబంధించిన విషయాలు నాకు తెలియవు. వైద్యులు, పరిశోధకులకు ఇదే నా నమస్కారం. చంద్ర సంబంధ వస్తువులతో మందు తయారు చేసే అవకాశం ఉందేమో భారతీయ తత్వ చింతనతో ఒక్కసారి ఆలోచించండి. ప్రయోగం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని నా అభిప్రాయం మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు... గరికపాటి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.