ETV Bharat / city

భాగ్యనగర పరిశుభ్రత.. ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత...

హైదరాబాద్​లో జనాభా పెరిగేకొద్ది వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, జీహెచ్​ఎంసీ అధికారులు వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. రహదారులు, కాలనీల్లో అనేక చోట్ల చెత్త కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అసలు చెత్త నిర్వహణలో లోపం ఎక్కడ వస్తోంది.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎలా అనే అంశాలపై ఈటీవీ భారత్ కథనం...

garbage-management-in-hyderabad-needs-citizens-hand
నగర పరిశుభ్రత.. ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత...
author img

By

Published : Nov 27, 2020, 6:19 PM IST

భాగ్యనగరంలో.. ఎక్కడ చూసిన వ్యర్థాల దర్శనం. గత దశాబ్ద కాలంలో జీహెచ్​ఎంసీ తీసుకున్న చర్యలతో కొంత మేర రోడ్లు, కాలనీల్లో చెత్త తగ్గినప్పటికీ... ఇంకా అనేక చోట్ల ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న వ్యర్థాలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యర్థాల రీ-సైక్లింగ్ పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న మున్సిపల్ పరిపాలనా శాఖ వీటి నిర్వహణపై మరింత సమగ్రంగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.

శాస్త్రీయ పద్ధతిలో చెత్త నిర్వహణ

గ్రేటర్ హైదరాబాద్​లో రోజుకు రెండు వేల ఎం.ఎల్.జీల వ్యర్థ జలాలు విడుదలవుతుండగా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా 41 శాతం జలాలను శుద్ధి చేసి చేసి మూసిలోకి విడుదల చేస్తున్నారు. నగరంలోని చెత్తను తరలించేందుకు ప్రస్తుతం ఉన్న జవహర్​నగర్ డంపింగ్​తోపాటు సంగారెడ్డి జిల్లా లక్డారం, మెదక్ జిల్లా ప్యారా నగర్, మేడ్చల్ జిల్లా దుండిగల్ లలోనూ ఏర్పాటు చేయడానికి సర్కార్ యోచిస్తోంది. అత్యంత ఆధునీకరణతో శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

చెత్తతో విద్యుత్ ఉత్పత్తి

జీహెచ్​ఎంసీలో రోజుకు సుమారు 6వేల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పలు ప్లాంట్​లను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే జవహర్​నగర్​లో దాదాపు 1200 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాల నుంచి 19.8 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో 28 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల వేస్ట్ టూ ఎనర్జీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ 18 నెలల్లో విద్యుత్ ఉత్పాదన ప్రారంభిచనుంది. వీటితో పాటు దుండిగల్​లో 15 మెగా వాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్​ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

నిర్మాణ వ్యర్థాల తరలింపు

నిర్మాణ వ్యర్థాలు తరలించేందుకు.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800120072659కు ఫోన్ చేస్తే నామమాత్రపు రుసుముతో తరలించడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. టన్ను వ్యర్థానికి 342 రూపాయలు చెల్లిస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చి వ్యర్థాలను తరలిస్తుంది.

నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్

నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్​కు జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్ దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దది. ఫతుల్లాగూడాలోనూ మరో ప్లాంట్ రూపొందించారు. ఒక్కో ప్లాంట్​లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. దీనివల్ల నిర్మాణ వ్యర్థ పదార్థాల్లో 90 శాతానికి పైగా తిరిగి ఉపయోగపడేలా సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి ఇలా వేర్వేరుగా వస్తాయి. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్​లో 80 - 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం వస్తాయి. వేరుచేసిన ఈ మెటీరియల్స్ తో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు.

పౌరుల బాధ్యతా ముఖ్యమే..

ప్రభుత్వం ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రహదారులు, కాలనీల్లో చెత్త కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా.. ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వర్తించినప్పుడే భాగ్యనగరంలో చెత్త నిర్వహణ సాధ్యమై.. పరిశుభ్రంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.