ETV Bharat / city

వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆన్​లైన్​ క్లాసులో ఉండగా.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

MLA VAMSHI COMMENTS: ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. పంజాబ్​లోని మొహాలీ క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన వంశీకి.. ఎడమచేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో.. స్థానికంగా ఉన్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.

vallabaneni vamshi
vallabaneni vamshi
author img

By

Published : Jun 22, 2022, 3:28 PM IST

MLA VAMSHI COMMENTS: ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో గతేడాది సీటు సాధించి.. అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలో ఇన్‌ పబ్లిక్‌ పాలసీ కోర్సు చేస్తున్న ఆయన.. సోమవారం నుంచి పంజాబ్​లోని మొహాలీ క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు వెళ్తున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్‌ తరగతులు జరుగుతున్నాయి.

మంగళవారం తరగతులకు హాజరైన వంశీకి ఎడమచేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో.. స్థానికంగా ఉన్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆస్పత్రిలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ఒకట్రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కుటుంబసభ్యులకు.. వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.