కామాంధుల అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి ఏదోవిధంగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' కింద ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు యువకులు(యోగేశ్ కుమార్, బబ్లు).. ఓ యువతి (22)పై అత్యాచారానికి తెగబడ్డారు. వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనను నిందితుల్లో ఒకరు రికార్డు చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం ఆ వీడియోతో యువతిని వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వీడియో తొలగిస్తానని చెప్పి.. మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకుండా మళ్లీ మళ్లీ బెదిరింపులు వస్తుండడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని భోపా పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: Sexual Abuse: లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..