ETV Bharat / city

ఊరంతా సంబురం... ముగిసిన గణపతి నిమజ్జనం... - Ganesh_immersion_

హైదరాబాద్​లో వినాయక నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. నిన్న ఉదయం బాలాపూర్ గణేష్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఇవాళ మధ్యాహ్నం వరకు సాగింది. ఖైరతాబాద్ వినాయకుడు నిన్న మధ్యాహ్నమే నిమజ్జనం చేశారు. కానీ మిగతా వాటి విషయంలో మాత్రం కొంత ఆలస్యం ఏర్పడింది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్​లో  20 వేలకు పైచిలుకు విగ్రహాల నిమజ్జనం జరిగింది.

ఊరంతా సంబురం.. ముగిసిన గణపతి నిమజ్జనం..
author img

By

Published : Sep 13, 2019, 10:18 PM IST

హైద‌రాబాద్ జంట నగరాల్లో గ‌ణేష్ నిమ‌జ్జన కార్యక్రమం విజ‌య‌వంతంగా ముగిసింది. నిన్న ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఇవాళ మధ్యాహ్నం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిమజ్జనం సాఫీగా ముగిసిన నేపథ్యంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని మధ్యాహ్నం లోపే నిమజ్జనం చేశారు. మొత్తం ప్రక్రియ ఇవాళ ఉదయం 10 గంటల లోపు పూర్తి చేయాలనుకున్న కొంత ఆలస్యంగా మధ్యాహ్నం వరకు కొనసాగింది.

సుమారు 30 వేల విగ్రహాల నిమజ్జనం...

నగరంలో ప్రధానమైన చెరువులతో పాటు.... హుస్సేన్ సాగర్​లోనే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేశారు. 20 వేలకు పైగా విగ్రహాలను హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేశారు. న‌గ‌రంలోని 23 చెరువుల వ‌ద్ద.. ఈ-కొలనుల్లో 30 వేలకు పైగా విగ్రహాల నిమ‌జ్జనం చేశారు.

అన్ని శాఖలు సమన్వయంతో...

నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జల మండలి, విద్యుత్ అధికారులు సమన్వయంతో వ్యవహరించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీకుమార్ ఇతర శాఖల అధికారులు దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం... వేడుకగా సాగించారని మేయర్ అధికారులను ప్రశంసించారు.

మరో మూడు రోజుల పాటు చెత్త ఏరివేసే ప్రక్రియ...

నిమజ్జనం ముగిసినందున హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపై అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు ప్రక్షాళన ప్రక్రియ సాగనుంది. నిమజ్జనం రోజు సాగర్ వద్ద తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

ఊరంతా సంబురం.. ముగిసిన గణపతి నిమజ్జనం..

ఇదీ చూడండి: నీటితొట్టిలో గణేశుడి నిమజ్జనం... ఈ ఉత్సవమెంతో ఆదర్శం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.